Responsive Ad Slot

Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Covid Second Wave : కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరం

No comments

Covid Second Wave: కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరం, వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం, 10 రాష్ట్రాల నుంచే కేసులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపిన కేంద్రం


Fine of Rs 2000 for not wearing mask at public place, announces AAP govt  amid rising COVID-19 cases in Delhi | India News | Zee News
New Delhi, Nov 28: ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ (Covid Second Wave) కల్లోలం రేపుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో కోవిడ్ మూడవదశలోకి (Covid Third Wave) ప్రవేశించింది. భారత్ లో కూడా సెకండ్ వేవ్ ఛాయలు కనిపిస్తున్నాయి, ఇప్పటికే ఢిల్లీ సెకండ్ వేవ్ దాటి మూడవ దశలోకి (Delhi Coronavirus) ప్రవేశించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఆంక్షల్ని కఠినంగా అమలు చేయాలని సుప్రీం కోర్టు (Supreme Court) శుక్రవారం కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

కరోనా వ్యాక్సిన్‌ వచ్చేంతవరకు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పాటించాలని, కరోనా మార్గదర్శకాలు అమలయ్యేలా చూసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేసింది. దేశంలో కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఆర్‌ఎస్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాల బెంచ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రమాదకరంగా ఉండబోతోందని హెచ్చరించింది. కరోనా మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలి. దేశ ప్రజల్లో 60 శాతం మంది మాస్కులు పెట్టుకోవడం లేదు. 30శాతం మంది గడ్డం కిందకి మాస్కుల్ని వేలాడదీస్తున్నారు. గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. ఆంక్షల్ని కఠినతరం చేయాలని కేంద్రానికి స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో పది రాష్ట్రాల నుంచి 77% కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకి తెలిపింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయంటూ ఒక అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఢిల్లీలో రాష్ట ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల కేసుల సంఖ్య బాగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. అయితే రాష్ట్రాలు చర్యలు తీసుకోకపోతే కోవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చూసే బాధ్యత కేంద్రానిదేనని బెంచ్‌ స్పష్టం చేసింది.

దీపిక ఇంత బోల్డ్ గా మట్లాడేసిందే

No comments
Deepika Padukone Interview With Anupama Chopra | Padmaavat | Film Companion  - YouTube
 
బాలీవుడ్ భామ దీపికా పదుకునే నటించిన  హాలీవుడ్ సినిమా 'ట్రిపులెక్స్ రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్'  సంక్రాంతి సందర్భంగా భారత్ లో విడుదలై సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.  త్వరలోనే ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  దీంతో దీపిక అమెరికాలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది.  ఈ సందర్భంగా ఆమె ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ హాలీవుడ్ హీరో విన్ డిజెల్ తో తనకు శృంగార సంబంధం ఉందని పరోక్షంగా అంగీకరించింది.

అమెరికాలో  విశేషమైన ఆదరణ పొందిన టాక్ షో డిజెనరస్ లో  దీపిక పాల్గొంది.... సినిమా ప్రచారం నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర సమాధానాలు చెప్పింది. విన్ డీజిల్ తో తన అనుబంధం ఊహాజనితమైనదని ..  అందులో పిల్లల్ని కన్నా ఎలాంటి ఇబ్బంది లేదంటూ గతంలో చెప్పిన అంశాలనే చెప్పింది. అయితే...  'విన్ డీజిల్ తో నీకు శృంగార సంబంధం ఉందని అంతా అనుకుంటున్నార'న్న  ప్రశ్నకు  ఆమె చెప్పిన సమాధానం మాత్రం ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనంగా మారిపోయింది.

విన్ డీజెల్ తో నీకు శృంగార సంబంధం ఉందా అన్న ఆ ప్రశ్నకు ఆమె... 'నిప్పు లేనిదే పొగరాదు కదా?' అంటూ సమాధానం చెప్పడం గమనార్హం.  అంటే తమ  మధ్య ఆ సంబంధం ఉన్నట్లు దీపిక అంగీకరించినట్లే.

భలే గిరాకీ: అమ్మాయిలపై ఒత్తిడి, అద్దెకు బాయ్‌ప్రెండ్స్

No comments
బీజింగ్: చైనాలో అప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం లేని యువతులు, తల్లిదండ్రుల ఒత్తిడి భరించలేక బాయ్ ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకుంటున్నారు. ఇందుకోసం బాయ్ ఫ్రెండ్స్‌ను అద్దెకు ఇచ్చే కేంద్రాలను సంప్రదిస్తున్నారు. చైనా అమ్మాయిలు ఎక్కువ మంది ఇంటికి దూరంగా ఉంటూ చదువుకోవడం లేదా, ఉద్యోగాలు చేసుకోవడం చేస్తారు. వారికి పెళ్లీడు వస్తే తల్లిదండ్రులు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. దాని నుంచి తప్పించుకునేందుకు వారు బాయ్ ఫ్రెండ్స్‌ను అద్దెకు తీసుకుంటున్నారు. అందంగా, మంచి ఫిజిక్ ఉండే అబ్బాయిలు డబ్బులు తీసుకొని యువతులకు బాయ్‌ఫ్రెండ్‌గా నటిస్తారు. జనవరి 28న చైనా కొత్త ఏడాది వేడుకలు జరుపుకొంటున్న నేపథ్యంలో చాలామంది యువతులు సొంత గ్రామాలకు వెళ్తున్నారు.


Most famous apps to meet lovers in China! - TailorMade Chinese

తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తేకుండా ఉండేందుకు అద్దెకు తీసుకున్న బాయ్ ఫ్రెండ్స్‌ను చూపిస్తారు. బాయ్‌ఫ్రెండ్‌ అనో, పెళ్లి చేసుకున్నామనో చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. చైనా కొత్త ఏడాదికి వారమే గడువు ఉంది. దీంతో ఇప్పుడు అద్దె బాయ్‌ఫ్రెండ్‌ సర్వీసులకు డిమాండ్‌ భారీగా పెరిగింది. ఇందుకోసం యువతులు రూ.10వేల నుంచి 15వేల వరకు ఖర్చు చేస్తున్నారు. పర్సనాలిటీ, విద్యార్హతలను బట్టి రేటు ఉంటుంది. అయినా అద్దెకు తీసుకుంటున్నారు. ముక్కుమొహం తెలియకుండా బాగుండదు కాబట్టి.. తల్లిదండ్రులకు వివరాలు చెప్పేందుకు.. సదరు అద్దె బాయ్ ఫ్రెండ్ గురించిన అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ముందుగానే అతనిని పరిచయం చేసుకొని, వ్యక్తిగత విషయాలు తెలుసుకొని ఇంటికి తీసుకెళ్తున్నారు.

బిగ్ షాక్: టాయ్‌లెట్‌లో 'కెమెరాలు' పెట్టించిన కాలేజీ యాజమాన్యం..

No comments

కొంతమంది అల్లరి విద్యార్థులు టాయ్‌లెట్ లో నాటుబాంబు పెట్టడంతో.. తొండై తున్నై అనే లెక్చరర్ బాంబు దాడిలో గాయపడ్డారు.

కోయంబత్తూరు: 'టాయ్‌లెట్ లో సీసీటీవీ కెమెరాలు'.. ఇదేదో ఆకతాయిలు, అల్లరిమూకలు చేసిన పని కాదు. సాక్షాత్తు ఓ కాలేజీ యాజమాన్యం వారు తీసుకున్న చర్య. విద్యార్థుల ఆకతాయి ధోరణిని నియంత్రించలేక.. ఏకంగా టాయ్‌లెట్ లో సీసీటీవీ కెమెరాలు పెట్టించింది కాలేజీ యాజమాన్యం. అసలు విషయానికొస్తే.. కొంతమంది అల్లరి విద్యార్థులు టాయ్‌లెట్ లో నాటుబాంబు పెట్టడంతో.. తొండై తున్నై అనే లెక్చరర్ బాంబు దాడిలో గాయపడ్డారు. దీంతో విద్యార్థుల చర్యలను కనిపెట్టేందుకు ఏకంగా టాయ్ లెట్ లోనే సీసీటీవీ కెమెరాలను పెట్టించింది యాజమాన్యం.

CCTV Cameras in Toilets by a college management

టాయ్ లెట్స్ కు వెళ్లే విద్యార్థులంతా ప్రవేశ ద్వారం వద్ద తమ ప్యాంట్లు విప్పేసి.. అక్కడే ఉన్న లుంగీని కట్టుకెళ్లాలంటూ కళాశాల ప్రిన్సిపాల్ ఓ లేఖ జారీ చేశారు. విషయం కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కడంతో.. ప్రస్తుతం ఆ లేఖ హాట్ టాపిక్ గా మారింది.

నేటి నుంచి యూకే కొత్త వీసా విధానం అమల్లోకి... భారత ఉద్యోగులపై ప్రభావం

No comments
తమ దేశంలోకి వలస వస్తున్న విదేశీ ఉద్యోగులను నిలువరించడమే లక్ష్యంగా వీసా విధానంలో యునైటెడ్ కింగ్ డమ్ మార్పులు చేయగా, అవి నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధనలతో భారత్ నుంచి వెళ్లే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగులపైనే అధిక ప్రభావం పడుతుందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ కొత్త రూల్స్ ప్రకారం, నవంబర్ 24 తరువాత టైర్-2 ఇంటర్నల్ కంపెనీ ట్రాన్స్ ఫర్ (ఐసీటీ) కోసం దరఖాస్తు చేసుకుంటే 30 వేల పౌండ్లు కట్టాలి. గతంలో ఇది 20,800 పౌండ్లు ఉండేదన్న సంగతి తెలిసిందే. 

Image result for employees india


ఇక ఐసీటీ విధానంలో జారీ అయిన వీసాల్లో 90 శాతం భారత ఉద్యోగులే ఉండటంతో ఈ నిబంధన చూపే అత్యధిక ప్రభావం భారత ఐటీ కంపెనీలపైనే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక విదేశాల నుంచి తీసుకువచ్చే ఉద్యోగుల్లో టైర్ 2 సాధారణ ఉద్యోగులకు రూ. 20.80 లక్షల వేతనం ఉండాలని, శిక్షణ నిమిత్తం వచ్చే గ్రాడ్యుయేట్ ట్రయినీలైతే వేతనం రూ. 19.14 లక్షలుగా ఉండాలని నిర్ణయించారు. ఇంత వేతనాలను ఐటీ కంపెనీలు ఆఫర్ చేసేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇక ఒక్కో కంపెనీ సంవత్సరానికి 20 మందిని మాత్రమే తీసుకురావాలన్న నిబంధన కూడా నేటి నుంచి యకేలో అమల్లోకి రానుంది.

హైదరాబాద్‌లో చిన్నారిపై దుశ్చర్య.. ఫేస్‌బుక్ పోస్ట్‌ ద్వారా వెలుగులోకి వ‌చ్చిన క‌ర్క‌శ‌త్వం

No comments
Image result for facebook

హైదరాబాద్‌లో ఓ వ్య‌క్తి ఇటీవ‌ల చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా కొంద‌రు వ్య‌క్తులు అభం శుభం తెలియ‌ని చిన్నారుల‌పై చేస్తోన్న దుశ్చ‌ర్య‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. కొంద‌రు దుండ‌గులు మూడేళ్ల‌ ఓ బాబును ఒంటిపై దుస్తులు లేకుండా కర్ర స్తంభానికి కట్టేశారు. గ‌మ‌నించిన‌ మర్రిపాటి శ్రీనివాసులు అనే వ్యక్తి త‌న మొబైల్‌లో ఆ చిన్నారిని ఫొటో తీసి, అనంత‌రం త‌న‌ ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. స‌ద‌రు చిన్నారి భిక్షాటన చేయడానికి ఒప్పుకోలేద‌ని అందుకే ప‌లువురు ఆ బాలుడిప‌ట్ల క‌ర్క‌శ‌త్వంగా ప్ర‌వ‌ర్తించార‌ని పేర్కొన్నారు. 

ఈ పోస్టుకు ఫేస్‌బుక్‌లో 7 వేల‌కు పైగా లైకులు, దాదాపు 4000 కామెంట్లు, 49 వేలకు పైగా షేర్లు వ‌చ్చాయి. చివ‌రికి బాలల హక్కుల సంఘం వ‌ద్ద‌కు చేరింది. వారు డీజీపీ అనురాగ్‌శర్మకు ఈ ఘ‌ట‌న‌పై ఫిర్యాదు చేశారు. బాలుడిని వారి బారి నుంచి కాపాడి, ఇటువంటి ఘ‌ట‌న‌కు పాల్ప‌డుతున్న వారిని కఠినంగా శిక్షించాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పోస్టుపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అబ్బాయిలతో చట్టపట్టాలేసుకు తిరిగే అమ్మాయిలకు ఎన్ఐటీ వార్నింగ్

No comments
హాస్టల్ లో ఉంటూ అబ్బాయిలతో కలసి తిరుగుతూ కనిపిస్తే, హాస్టల్ నుంచి బహిష్కరిస్తామని కాలికట్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. రెసిడెన్షియల్ క్యాంపస్ లో అబ్బాయిలతూ కలసి అమ్మాయిలు కనిపిస్తే చూస్తూ ఊరుకోబోమని హాస్టల్ వార్తెన్ ఎస్ భువనేశ్వరి సంతకంతో నోటీసు బోర్డులో నోటీసులు కనిపించగా, వీటిపై విద్యార్థులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. 

Image result for telugu lovers walking

ప్రధాన క్యాంపస్ కు ఎదురుగా రెండు రెసిడెన్షియల్ క్యాంపస్ లు ఉండగా, వీటిల్లో విద్యార్థినులకు ఆతిథ్యం కల్పిస్తున్నారు. ఆ పక్కనే ఫ్యాకల్టీలకు రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఉంటాయి. ఇక కేవలం అమ్మాయిలకు మాత్రమే నోటీసులు జారీ చేయడాన్ని తప్పుబడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ఐటీ పూర్వ విద్యార్థులు సైతం ఇది లింగ వివక్షతేనని, మోరల్ పోలీసింగ్ ను విద్యార్థినులపై మాత్రమే రుద్దుతున్నారని విమర్శించారు. కేవలం అబ్బాయిలతో కనిపించే అమ్మాయిలనే హాస్టళ్ల నుంచి పంపేస్తామని చెప్పడం వివక్షతేనని అంటున్నారు. 
ఇక భువనేశ్వరి నోటీసులను కొందరు ఫ్యాకల్టీలు సైతం తప్పుబడుతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులను కొందరు ఎన్నటికీ అంగీకరించే స్థితిలో లేరని ఎలక్ట్రికల్ ఇంజనీంగ్ విభాగం ప్రొఫెసర్ పౌల్ జోసఫ్ వ్యాఖ్యానించారు. కలిసి నడిచినంత మాత్రాన చదువుకునే వారిని సస్పెండ్ చేసి ఇంటికి పంపేస్తారా? అని ప్రశ్నించారు. ఈ నోటీసులు తమకు షాక్ కలిగించాయని విద్యార్థినుల ప్రతినిధి నిమిషా రాయ్ వ్యాఖ్యానించగా, వీటిని వెనక్కు తీసుకోవాలని విద్యార్థుల సంక్షేమ సంఘం ప్రతినిధి జీ ఉన్నికృష్ణన్ డిమాండ్ చేశారు.
Don't Miss
Viral-Adda-99 © all rights reserved
DPR