Responsive Ad Slot

Showing posts with label Film-News. Show all posts
Showing posts with label Film-News. Show all posts

ఇండస్ట్రీలో రకుల్ హవా

No comments


అందాల తార రకుల్‌ కెరీర్ జెడ్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. రీసెంట్‌గా క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి ఓ సినిమాను పూర్తి చేసిన రకుల్ త్వరలోనే బాలీవుడ్ సినిమా ‘మేడే’ షూటింగ్‌లో పాల్గొననుంది. ఆ మూవీ షూటింగ్ ప్రారంభమవడానికి కాస్త టైమ్ ఉండటంతో, ఈ భామ తన ఫ్యామిలీతో కలిసి ‘మాల్దీవ్స్’లో చిల్ అవ్వడానికి వెళ్లింది. అందాల ప్రకృతిని ఆస్వాదిస్తూ, నీలి సాగరమే ఆచ్చెరువొందెట్లు తన మాల్దీవుల వెకేషన్స్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తూనే అభిమానులకు తను నటించబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్ వివరాలు కన్ఫార్మ్ చేసి శుభవార్త అందించింది.

రకుల్ నటించే చిత్రాలపై కొన్ని రూమర్స్ వస్తున్నాయి. దాంతో వాటికి చెక్ చెప్పడానికి రకుల్ మేనేజర్ ఆమె అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ వివరాలు అధికారికంగా అనౌన్స్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న ‘చెక్’ సినిమాలో అడ్వకేట్‌గా రకుల్ కనిపించబోతుంది. ఇందులో నితిన్ లీడ్ రోల్‌లో కనిపిస్తారు. తమిళంలో శివ కార్తికేయన్‌తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనుంది. బాలీవుడ్‌లో జాన్ అబ్రహంతో కలిసి ‘అటాక్’ అనే చిత్రంతోపాటు, అర్జున్ కపూర్‌తో మరో సినిమా చేయనుంది. ఇక అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్‌ చిత్రం ‘మేడే’ లోనూ ఆమె హీరోయిన్‌గా చేస్తుంది. ఇక క్రిష్, వైష్ణవ్ తేజ్ కలయికలో వస్తున్న సినిమా అల్రెడీ షూటింగ్ ముగించుకుంది. రకుల్ రాబోయే సంవత్సరం కాలం పాటు తీరికలేని షూటింగ్స్‌తో బిజీబిజీగా గడపబోతున్నట్లు ఈ ప్రాజెక్ట్స్ చూస్తేనే అర్థమవుతోంది. ఇక రకుల్ ఫ్యాన్స్‌కు 2021 పండగే అన్నమాట.

టాలీవుడ్ ‘టామ్ బాయ్స్’

No comments

Charmi Kaur wallpaper | 2560x1600 | 312536 | WallpaperUP

టామ్ బాయ్ అంటే.. అమ్మాయి అయినప్పటికీ అబ్బాయిలా బిహేవ్ చేయడం. అబ్బాయిలు చేసే యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ చూపించడం, అబ్బాయిలాగే డ్రెస్ అప్ కావడం, సిగ్గుపడే ప్రస్తావనే లేకపోవడం. ధైర్యంగా మాట్లాడటం.. తిట్టాల్సి వస్తే నిర్భయంగా, మనస్ఫూర్తిగా, మొహమాటం లేకుండా అబ్బాయిల కంటే బాగా బూతులు తిట్టేయడం. డ్రామా క్వీన్స్‌లా కాకుండా ప్రాక్టికల్‌గా ఉండటం. ఫ్యామిలీ రెస్పాన్స్ తీసుకోవడం, అమ్మానాన్నను ఎలా చూసుకోవాలి? ఏ బిజినెస్ చేయాలని ఆలోచించడం. సొసైటీ గురించి పట్టించుకోకుండా మగాళ్లతో సమానంగా సక్సెస్ కావాలని ట్రై చేయడం, మగాళ్లతో ఫ్రెండ్‌షిప్ చేయడం. ‘యాక్ట్ లైక్ మెన్.. థింక్ లైక్ మెన్.. నిజం చెప్పాలి అంటే టామ్ బాయ్ వల్లే ప్రపంచం మారుతుంది’ అనేది డైరెక్టర్ పూరి జగన్నాధ్ లేటెస్ట్ పొడ్‌కాస్ట్. మరి అలాంటి టామ్ బాయ్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరున్నారు? అంటూ టామ్ బాయ్ ట్రెండ్‌కు తెరలేపింది టాలీవుడ్ వన్ ఆఫ్ టామ్ బాయ్ చార్మి కౌర్. ఈ చాలెంజ్‌లో తాము కలిసిన టామ్ బాయ్ పేర్లను చెప్పాల్సి ఉంటుంది.

https://twitter.com/Charmmeofficial/status/1331562958678224897?s=19

ఈ క్రమంలో ఇండస్ట్రీలో తను కలిసిన టామ్ బాయ్స్‌లో రమ్య కృష్ణ, త్రిష, సమంత, నభా నటేష్, లక్ష్మీ మంచు, నందిని రెడ్డి, ఆదా శర్మ పేర్లను తెలపగా.. ఈ చాలెంజ్ స్వీకరించిన రమ్య కృష్ణ.. రాధికా శరత్ కుమార్, మధు బాలను నామినేట్ చేశారు. ఇక మంచు లక్ష్మీ ప్రసన్న.. రకుల్ ప్రీత్, తాప్సీ, సునీతా కృష్ణన్‌ను నామినేట్ చేశారు. నందిని రెడ్డి.. సమంత, స్వప్న దత్‌తో పాటు ఇషా కొప్పికర్‌ను నామినేట్ చేసింది. ఇండస్ట్రీలో ఇంకా టామ్ బాయ్ చైన్ కొనసాగుతుండగా.. ఈ పొడ్‌కాస్ట్‌పై సామాన్యుల నుంచి కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

గర్భిణి పాత్రలో అనసూయ..

No comments

 

అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. రమేష్ రాపర్తి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ప్రీ లుక్‌ను రానా, ప్రభాస్ రిలీజ్ చేయగా.. ఫస్ట్ లుక్‌ను సాయి ధరమ్ తేజ్ విడుదల చేశారు. జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్ నాథ్, బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో అనసూయ ప్రెగ్నెంట్ ఉమెన్‌గా కనిపించనుంది. గుణ బాలసుబ్రమణ్యన్ సంగీతం సమకూరుస్తున్న సినిమా పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండగా.. అసలు కథ ఏంటో తెలియాలంటే మరో అప్‌డేట్ రావాల్సిందే. కాగా అనసూయ ఫస్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్ మరో కంటెంట్ ఉన్న రోల్ పడిందని సంబరపడుతున్నారు.

Don't Miss
Viral-Adda-99 © all rights reserved
DPR