బీజింగ్: చైనాలో అప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం లేని యువతులు, తల్లిదండ్రుల ఒత్తిడి భరించలేక బాయ్ ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకుంటున్నారు. ఇందుకోసం బాయ్ ఫ్రెండ్స్‌ను అద్దెకు ఇచ్చే కేంద్రాలను సంప్రదిస్తున్నారు. చైనా అమ్మాయిలు ఎక్కువ మంది ఇంటికి దూరంగా ఉంటూ చదువుకోవడం లేదా, ఉద్యోగాలు చేసుకోవడం చేస్తారు. వారికి పెళ్లీడు వస్తే తల్లిదండ్రులు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. దాని నుంచి తప్పించుకునేందుకు వారు బాయ్ ఫ్రెండ్స్‌ను అద్దెకు తీసుకుంటున్నారు. అందంగా, మంచి ఫిజిక్ ఉండే అబ్బాయిలు డబ్బులు తీసుకొని యువతులకు బాయ్‌ఫ్రెండ్‌గా నటిస్తారు. జనవరి 28న చైనా కొత్త ఏడాది వేడుకలు జరుపుకొంటున్న నేపథ్యంలో చాలామంది యువతులు సొంత గ్రామాలకు వెళ్తున్నారు.
తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తేకుండా ఉండేందుకు అద్దెకు తీసుకున్న బాయ్ ఫ్రెండ్స్‌ను చూపిస్తారు. బాయ్‌ఫ్రెండ్ అనో, పెళ్లి చేసుకున్నామనో చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. చైనా కొత్త ఏడాదికి వారమే గడువు ఉంది. దీంతో ఇప్పుడు అద్దె బాయ్‌ఫ్రెండ్ సర్వీసులకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇందుకోసం యువతులు రూ.10వేల నుంచి 15వేల వరకు ఖర్చు చేస్తున్నారు. పర్సనాలిటీ, విద్యార్హతలను బట్టి రేటు ఉంటుంది. అయినా అద్దెకు తీసుకుంటున్నారు. ముక్కుమొహం తెలియకుండా బాగుండదు కాబట్టి.. తల్లిదండ్రులకు వివరాలు చెప్పేందుకు.. సదరు అద్దె బాయ్ ఫ్రెండ్ గురించిన అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ముందుగానే అతనిని పరిచయం చేసుకొని, వ్యక్తిగత విషయాలు తెలుసుకొని ఇంటికి తీసుకెళ్తున్నారు.
No comments
Post a Comment