Responsive Ad Slot

నేటి నుంచి యూకే కొత్త వీసా విధానం అమల్లోకి... భారత ఉద్యోగులపై ప్రభావం

Thursday

/ Post Views : 79
తమ దేశంలోకి వలస వస్తున్న విదేశీ ఉద్యోగులను నిలువరించడమే లక్ష్యంగా వీసా విధానంలో యునైటెడ్ కింగ్ డమ్ మార్పులు చేయగా, అవి నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధనలతో భారత్ నుంచి వెళ్లే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగులపైనే అధిక ప్రభావం పడుతుందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ కొత్త రూల్స్ ప్రకారం, నవంబర్ 24 తరువాత టైర్-2 ఇంటర్నల్ కంపెనీ ట్రాన్స్ ఫర్ (ఐసీటీ) కోసం దరఖాస్తు చేసుకుంటే 30 వేల పౌండ్లు కట్టాలి. గతంలో ఇది 20,800 పౌండ్లు ఉండేదన్న సంగతి తెలిసిందే. 

Image result for employees india


ఇక ఐసీటీ విధానంలో జారీ అయిన వీసాల్లో 90 శాతం భారత ఉద్యోగులే ఉండటంతో ఈ నిబంధన చూపే అత్యధిక ప్రభావం భారత ఐటీ కంపెనీలపైనే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక విదేశాల నుంచి తీసుకువచ్చే ఉద్యోగుల్లో టైర్ 2 సాధారణ ఉద్యోగులకు రూ. 20.80 లక్షల వేతనం ఉండాలని, శిక్షణ నిమిత్తం వచ్చే గ్రాడ్యుయేట్ ట్రయినీలైతే వేతనం రూ. 19.14 లక్షలుగా ఉండాలని నిర్ణయించారు. ఇంత వేతనాలను ఐటీ కంపెనీలు ఆఫర్ చేసేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇక ఒక్కో కంపెనీ సంవత్సరానికి 20 మందిని మాత్రమే తీసుకురావాలన్న నిబంధన కూడా నేటి నుంచి యకేలో అమల్లోకి రానుంది.

No comments

Post a Comment

Viral-Adda-99 © all rights reserved
DPR