Responsive Ad Slot

బిగ్ షాక్: టాయ్‌లెట్‌లో 'కెమెరాలు' పెట్టించిన కాలేజీ యాజమాన్యం..

Saturday

/ Post Views :

కొంతమంది అల్లరి విద్యార్థులు టాయ్‌లెట్ లో నాటుబాంబు పెట్టడంతో.. తొండై తున్నై అనే లెక్చరర్ బాంబు దాడిలో గాయపడ్డారు.

కోయంబత్తూరు: 'టాయ్‌లెట్ లో సీసీటీవీ కెమెరాలు'.. ఇదేదో ఆకతాయిలు, అల్లరిమూకలు చేసిన పని కాదు. సాక్షాత్తు ఓ కాలేజీ యాజమాన్యం వారు తీసుకున్న చర్య. విద్యార్థుల ఆకతాయి ధోరణిని నియంత్రించలేక.. ఏకంగా టాయ్‌లెట్ లో సీసీటీవీ కెమెరాలు పెట్టించింది కాలేజీ యాజమాన్యం. అసలు విషయానికొస్తే.. కొంతమంది అల్లరి విద్యార్థులు టాయ్‌లెట్ లో నాటుబాంబు పెట్టడంతో.. తొండై తున్నై అనే లెక్చరర్ బాంబు దాడిలో గాయపడ్డారు. దీంతో విద్యార్థుల చర్యలను కనిపెట్టేందుకు ఏకంగా టాయ్ లెట్ లోనే సీసీటీవీ కెమెరాలను పెట్టించింది యాజమాన్యం.

CCTV Cameras in Toilets by a college management

టాయ్ లెట్స్ కు వెళ్లే విద్యార్థులంతా ప్రవేశ ద్వారం వద్ద తమ ప్యాంట్లు విప్పేసి.. అక్కడే ఉన్న లుంగీని కట్టుకెళ్లాలంటూ కళాశాల ప్రిన్సిపాల్ ఓ లేఖ జారీ చేశారు. విషయం కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కడంతో.. ప్రస్తుతం ఆ లేఖ హాట్ టాపిక్ గా మారింది.

No comments

Post a Comment

Viral-Adda-99 © all rights reserved
DPR