Responsive Ad Slot

Showing posts with label Rashi. Show all posts
Showing posts with label Rashi. Show all posts

బాలయ్యపై హాట్ కామెంట్ చేసిన సీనియర్ భామ

No comments

Friday


సీనియర్ హీరోయిన్ రాశి తాజాగా బాలయ్య బాబుతో తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది. బాలయ్యతో రాశి బాలనటిగా, హీరోయిన్ నటించింది. ఈమేరకు ఆయనతో సినిమాల్లో పని చేయడంపై హాట్ కామెంట్ చేసింది. ‘బాలగోపాలం’ మూవీలో బాలయ్య పక్కన బాలనటిగా కన్పించానని.. ఆ తర్వాత కొన్నాళ్లకు హీరోయిన్ ఛాన్స్ రావడంపై ఆమె స్పందించింది. బాలయ్యకు జోడీ అవకాశం రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని అయితే ఆయన తనను ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం వేసిందని తెలిపింది.

‘కృష్ణబాబు’ సినిమా తొలిరోజు షూటింగ్ సమయంలో తనకు చాలా భయంవేసిందని పేర్కొంది. అయితే తాను అనుకున్నట్లు ఏం జరుగలేదని.. బాలయ్య తనను బాగా రిసీవ్ తీసుకున్నారని చెప్పారు. షూటింగ్ తొలిరోజు తాను కారు దిగి సెట్‌కు వెళ్తుండగా బాలయ్య అక్కడే కూర్చొని ఉన్నారని తెలిపింది. అయితే తాను విష్ చేసే లోపే ఎలా ఉన్నావ్.. ఇలారా అంటూ ఆయన పలకరించడంతో భయం పోయిందని చెప్పింది. ఆ వెంటనే కూల్ అయ్యానని బాలయ్యతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని పాతజ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. బాలయ్య చాలా నైస్ పర్సన్ అంటూ రాశి కితాబిచ్చింది. బాలనటిగా, హీరోయిన్ గా బాలయ్యతో చేయడం సంతోషాన్నిచ్చిందని తెలిపింది. పెళ్లి తర్వాత రాశి ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టింది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు రాశి తెలిపింది.
Don't Miss
Viral-Adda-99 © all rights reserved
DPR