Responsive Ad Slot

దీపిక ఇంత బోల్డ్ గా మట్లాడేసిందే

Saturday

/ Post Views : 84
Deepika Padukone Interview With Anupama Chopra | Padmaavat | Film Companion  - YouTube
 
బాలీవుడ్ భామ దీపికా పదుకునే నటించిన  హాలీవుడ్ సినిమా 'ట్రిపులెక్స్ రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్'  సంక్రాంతి సందర్భంగా భారత్ లో విడుదలై సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.  త్వరలోనే ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  దీంతో దీపిక అమెరికాలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది.  ఈ సందర్భంగా ఆమె ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ హాలీవుడ్ హీరో విన్ డిజెల్ తో తనకు శృంగార సంబంధం ఉందని పరోక్షంగా అంగీకరించింది.

అమెరికాలో  విశేషమైన ఆదరణ పొందిన టాక్ షో డిజెనరస్ లో  దీపిక పాల్గొంది.... సినిమా ప్రచారం నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర సమాధానాలు చెప్పింది. విన్ డీజిల్ తో తన అనుబంధం ఊహాజనితమైనదని ..  అందులో పిల్లల్ని కన్నా ఎలాంటి ఇబ్బంది లేదంటూ గతంలో చెప్పిన అంశాలనే చెప్పింది. అయితే...  'విన్ డీజిల్ తో నీకు శృంగార సంబంధం ఉందని అంతా అనుకుంటున్నార'న్న  ప్రశ్నకు  ఆమె చెప్పిన సమాధానం మాత్రం ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనంగా మారిపోయింది.

విన్ డీజెల్ తో నీకు శృంగార సంబంధం ఉందా అన్న ఆ ప్రశ్నకు ఆమె... 'నిప్పు లేనిదే పొగరాదు కదా?' అంటూ సమాధానం చెప్పడం గమనార్హం.  అంటే తమ  మధ్య ఆ సంబంధం ఉన్నట్లు దీపిక అంగీకరించినట్లే.

No comments

Post a Comment

Viral-Adda-99 © all rights reserved
DPR