Responsive Ad Slot

Showing posts with label Entertainment. Show all posts
Showing posts with label Entertainment. Show all posts

ఇండస్ట్రీలో రకుల్ హవా

No comments


అందాల తార రకుల్‌ కెరీర్ జెడ్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. రీసెంట్‌గా క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి ఓ సినిమాను పూర్తి చేసిన రకుల్ త్వరలోనే బాలీవుడ్ సినిమా ‘మేడే’ షూటింగ్‌లో పాల్గొననుంది. ఆ మూవీ షూటింగ్ ప్రారంభమవడానికి కాస్త టైమ్ ఉండటంతో, ఈ భామ తన ఫ్యామిలీతో కలిసి ‘మాల్దీవ్స్’లో చిల్ అవ్వడానికి వెళ్లింది. అందాల ప్రకృతిని ఆస్వాదిస్తూ, నీలి సాగరమే ఆచ్చెరువొందెట్లు తన మాల్దీవుల వెకేషన్స్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తూనే అభిమానులకు తను నటించబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్ వివరాలు కన్ఫార్మ్ చేసి శుభవార్త అందించింది.

రకుల్ నటించే చిత్రాలపై కొన్ని రూమర్స్ వస్తున్నాయి. దాంతో వాటికి చెక్ చెప్పడానికి రకుల్ మేనేజర్ ఆమె అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ వివరాలు అధికారికంగా అనౌన్స్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న ‘చెక్’ సినిమాలో అడ్వకేట్‌గా రకుల్ కనిపించబోతుంది. ఇందులో నితిన్ లీడ్ రోల్‌లో కనిపిస్తారు. తమిళంలో శివ కార్తికేయన్‌తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనుంది. బాలీవుడ్‌లో జాన్ అబ్రహంతో కలిసి ‘అటాక్’ అనే చిత్రంతోపాటు, అర్జున్ కపూర్‌తో మరో సినిమా చేయనుంది. ఇక అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్‌ చిత్రం ‘మేడే’ లోనూ ఆమె హీరోయిన్‌గా చేస్తుంది. ఇక క్రిష్, వైష్ణవ్ తేజ్ కలయికలో వస్తున్న సినిమా అల్రెడీ షూటింగ్ ముగించుకుంది. రకుల్ రాబోయే సంవత్సరం కాలం పాటు తీరికలేని షూటింగ్స్‌తో బిజీబిజీగా గడపబోతున్నట్లు ఈ ప్రాజెక్ట్స్ చూస్తేనే అర్థమవుతోంది. ఇక రకుల్ ఫ్యాన్స్‌కు 2021 పండగే అన్నమాట.

టాలీవుడ్ ‘టామ్ బాయ్స్’

No comments

Charmi Kaur wallpaper | 2560x1600 | 312536 | WallpaperUP

టామ్ బాయ్ అంటే.. అమ్మాయి అయినప్పటికీ అబ్బాయిలా బిహేవ్ చేయడం. అబ్బాయిలు చేసే యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ చూపించడం, అబ్బాయిలాగే డ్రెస్ అప్ కావడం, సిగ్గుపడే ప్రస్తావనే లేకపోవడం. ధైర్యంగా మాట్లాడటం.. తిట్టాల్సి వస్తే నిర్భయంగా, మనస్ఫూర్తిగా, మొహమాటం లేకుండా అబ్బాయిల కంటే బాగా బూతులు తిట్టేయడం. డ్రామా క్వీన్స్‌లా కాకుండా ప్రాక్టికల్‌గా ఉండటం. ఫ్యామిలీ రెస్పాన్స్ తీసుకోవడం, అమ్మానాన్నను ఎలా చూసుకోవాలి? ఏ బిజినెస్ చేయాలని ఆలోచించడం. సొసైటీ గురించి పట్టించుకోకుండా మగాళ్లతో సమానంగా సక్సెస్ కావాలని ట్రై చేయడం, మగాళ్లతో ఫ్రెండ్‌షిప్ చేయడం. ‘యాక్ట్ లైక్ మెన్.. థింక్ లైక్ మెన్.. నిజం చెప్పాలి అంటే టామ్ బాయ్ వల్లే ప్రపంచం మారుతుంది’ అనేది డైరెక్టర్ పూరి జగన్నాధ్ లేటెస్ట్ పొడ్‌కాస్ట్. మరి అలాంటి టామ్ బాయ్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరున్నారు? అంటూ టామ్ బాయ్ ట్రెండ్‌కు తెరలేపింది టాలీవుడ్ వన్ ఆఫ్ టామ్ బాయ్ చార్మి కౌర్. ఈ చాలెంజ్‌లో తాము కలిసిన టామ్ బాయ్ పేర్లను చెప్పాల్సి ఉంటుంది.

https://twitter.com/Charmmeofficial/status/1331562958678224897?s=19

ఈ క్రమంలో ఇండస్ట్రీలో తను కలిసిన టామ్ బాయ్స్‌లో రమ్య కృష్ణ, త్రిష, సమంత, నభా నటేష్, లక్ష్మీ మంచు, నందిని రెడ్డి, ఆదా శర్మ పేర్లను తెలపగా.. ఈ చాలెంజ్ స్వీకరించిన రమ్య కృష్ణ.. రాధికా శరత్ కుమార్, మధు బాలను నామినేట్ చేశారు. ఇక మంచు లక్ష్మీ ప్రసన్న.. రకుల్ ప్రీత్, తాప్సీ, సునీతా కృష్ణన్‌ను నామినేట్ చేశారు. నందిని రెడ్డి.. సమంత, స్వప్న దత్‌తో పాటు ఇషా కొప్పికర్‌ను నామినేట్ చేసింది. ఇండస్ట్రీలో ఇంకా టామ్ బాయ్ చైన్ కొనసాగుతుండగా.. ఈ పొడ్‌కాస్ట్‌పై సామాన్యుల నుంచి కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

సెక్స్.. సీన్లపై రాధికా అమాయిక ప్రశ్న

No comments

Tuesday



సినీ నటి రాధికా ఆప్టే ఏ పని చేసినా ఓ సెన్సేషన్. తాజాగా ఆమె ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె నటించిన తొలి హాలీవుడ్‌ చిత్రం ‘ది వెడ్డింగ్‌ గెస్ట్‌’లోని సహనటుడితో కలిసి రొమాన్స్ చేస్తున్న సన్నివేశం బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి లీకై సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.దీనిపై రాధిక స్పందిస్తూ ‘ఇది కచ్చితంగా సైకోల పనే. వారే ఇలాంటి పనులు చేస్తుంటారు. అయినా లీకైన సన్నివేశంలో నాతో పాటు నటుడు దేవ్‌ పటేల్‌ కూడా ఉన్నారు. మరి అతని పేరుతో ఎందుకు వైరల్‌ అవడం లేదు? అందరూ ఎందుకు నా పేరును మాత్రమే వాడుకుని వైరల్‌ చేస్తున్నారు. ‘ది వెడ్డింగ్‌ గెస్ట్‌’ చిత్రంలో లీకైన ఈ సన్నివేశం మాత్రమే కాదు ఇంకా ఎన్నో అందమైన సన్నివేశాలు ఉన్నాయి. ఇలా సన్నివేశాలు లీక్‌ చేయడం వల్ల వారికి కలిగే ఆనందం ఏంటో నాకు అర్థం కాదు’ అంటూ మండిపడ్డారు రాధిక.

బాడీ షేప్ మార్చుకున్న లక్ష్మి … బికినీ కోసమే పుట్టినట్టు

No comments
చాలా ఏళ్ళుగా మంచి హిట్‌ కోసం ఎదురుచూస్తున్న రాయ్‌ లక్ష్మి అనుకున్న విధంగా ఒక చిత్రం కూడా హిట్‌ కావడం లేదు. ఇక నుంచి మీరు కొత్త రాయ్‌ లక్ష్మిని చూస్తారని అంటోంది బెంగళూరు భామ. తన బాడీషేప్‌తో పాటు మనసు కూడా తేలికగా మారిందని అమ్మడు చెబుతోంది. ప్రస్తుతం ఆమె ‘సిండ్రిల్లా’ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఆమె నటించిన ‘నీయా2’ కూడా నిరాశపరిచింది. ఆ చిత్రంలో తన అందచందాలను ఆరబోసినా కూడా సినిమా బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించలేకపోయింది. ఎన్ని వైఫల్యాలు ఎదురైనా తాను మాత్రం మంచి హిట్‌ కోసం వెయిట్‌ చేస్తూనే వుంది. ప్రస్తుతం ‘సిండ్రిల్లా’ చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో బికినీలో ఫోజు ఇస్తూ తీసిన ఫోటోను పోస్ట్‌ చేసింది. అంతేకాకుండా మళ్లీ తన బాడీ బికినీ షేప్‌కు మారిందని, బాడితో పాటు మనసు కూడా చాలా తేలికగా వుందని పోస్ట్‌ చేసింది.

సినిమాల్లో చూపించే సొగసులు తక్కువ. సోషల్ మీడియాలో మాత్రం అన్ని చూపిస్తున్నారు…

No comments
సినిమాలు ఎలా తీసినా సక్సెస్ అయినా కాకపోయినా నో ప్రాబ్లం, పబ్లిసిటీ మాత్రం ఫీక్స్ లో ఉండాలి. అప్పుడే సంతృప్తి కలుగుతుంది. మన వర్కవుట్ కి న్యాయం జరుగుతుంది. సరిగ్గా అలాగే జరుగుతుంది బాలీవుడ్ మొత్తం.
సినిమాల్లో చూపించే సొగసులు తక్కువ అయిపోయి సోషల్ మీడియాలో మాత్రం అన్ని విప్పి చూపిస్తున్నారు. ఫ్యార్ కా పంచ్ నామా సినిమాలో చేసిన నుష్రత్ బికినీ ఫోటోలు వైరల్ గా మారాయి. హాలీవుడ్ ట్రిప్ ఇంజాయ్ చేస్తున్న అమ్ముడు బికినీలో దర్శనం ఇచ్చింది.
అక్కడి తో ఆగని అమ్మడు తన టాటు విశ్వరూపాన్ని చూపిస్తుంది. సరిగ్గా అక్కడే వేసుకుని కుర్రకారుకు హీట్ పుట్టిస్తుంది. ప్రస్తుతం ఆ టాటుపై చర్చ జరుగుతుంది…


సినిమాల్లో కంటే ఇంటర్వ్యూలోనే హాట్ గా కనిపిస్తోంది…

No comments
స్పైడర్ సినిమాతో రకుల్ తన లేడీ లక్ ని మాత్రమే గ్లామర్ ను కూడా కోల్పోయింది. అప్పటి వరకూ కాష్మీర్ యాపిల్ గా క్యూట్ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ఆఫర్ల కోసం సన్నబడే ప్రయత్నంలో ఉన్న గ్లామర్ & సెక్సీ నెస్ మొత్తం కోల్పోయింది. అప్పటివరకూ రకుల్ ను చూసి వాహ్ అన్నవాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవ్వడం మొదలెట్టారు. క్రమేణా రకుల్ కి తెలుగులో ఆఫర్లు తగ్గడంతో ప్రేక్షకులు కూడా మర్చిపోయారు.

అయితే:

బాలీవుడ్ లో వరుస పరాజయాల అనంతరం మళ్ళీ టాలీవుడ్ మీద కాన్సన్ ట్రేషన్ మొదలెట్టిన రకుల్ ప్రీత్.. తన పూర్వపు అందాలను కూడా తిరిగి రాబట్టుకొనే పనిలో పడింది. రకుల్ మునుపటి చిత్రమైన “దేవ్, మన్మధుడు 2″లో మరీ ఇబ్బందిగా కనిపించింది.
ఇటీవల ఓ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కి వర్కవుట్స్ చేస్తూ ఇచ్చిన ఇంటార్వ్యూలో రకుల్ ని చూసినవాళ్ళందరూ ‘గ్లామరస్ రకుల్ ఈజ్ బ్యాక్” అంటున్నారు. స్పోర్ట్స్ బ్రాలో సూపర్ హాట్ గా కనిపిస్తున్న రకుల్ ని చూసి ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. త్వరలో రకుల్ నితిన్ సినిమాలో కనిపించనుంది.

స్మిమ్మింగ్ పూల్‌లో శ్రియా అందాలు… బికినీతో

No comments
ఒక‌ప్పుడు స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించి కుర్రకారు హృద‌యాల‌ను దోచుకున్న ముద్దుగుమ్మ శ్రియా శ‌ర‌న్‌. ర‌ష్య‌న్ మ్యూజిషియ‌న్ అండ్రూతో పెళ్లి త‌ర్వాత సినిమాల్లో ఈ అమ్మడుకి సినిమా అవకాశాలు తగ్గిన మాట వాస్తవమే. సినిమాల్లో అవకాశాలు లేకపోతేనేం సోషల్ మీడియా పుణ్యమాని అందరికీ దగ్గరగానే ఉంటుంది.
తన హాట్ ఫోటోల‌తో సోష‌ల్ మీడియాలో యువ‌త‌కు కిర్రెక్కిస్తుందీ అమ్మ‌డు. రీసెంట్‌గా తిరువ‌నంత‌పురంలోని ఇన్ఫినిటీ హోటల్లోని స్మిమ్మింగ్ పూల్‌లో బ్లాక్ బికినీతో శ్రియా శ‌ర‌న్ ఎంజాయ్ చేస్తున్న వీడియోను శ్రియా తన సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసి అభిమానుల్లో సెగ‌లు పుట్టిస్తుంది.



ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంట‌ల్లోనే 3.27 ల‌క్ష‌లు వ్యూస్ వ‌చ్చాయి. ఈ అమ్మ‌డు త్వ‌ర‌లోనే అసుర‌న్‌ తెలుగు రీమేక్‌లో వెంక‌టేశ్‌తో క‌లిసి న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అవకాశాల కోసం! పలు తప్పులు చేశా. ఇక రాజకీయాల్లో వేలుపెడతా..

No comments
తెలుగుచిత్రపరిశ్రమలో గందరగోళం సృష్టించి చెన్నైలో మకాం పెట్టిన శ్రీరెడ్డి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పాల్గొంటానని చెబుతొంది. ఆమె చెన్నైలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇప్పుడు తమిళ ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. త్వరలోనే ఇక్కడ రాజకీయ ప్రవేశం చేయనున్నా. తమిళ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని చెప్పారు. నేను తప్పులు చేశా. ప్రస్తుతం వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. . అవకాశాల కోసం పలు తప్పులు చేశా. ఇకపై అలా జరగవని’ పేర్కొన్నారు.
నటుడు ఉదయనిధిపై తాను ఆరోపణలు చేసినట్లు వచ్చిన ఫేస్‌బుక్‌ పోస్టులో నిజం లేదని, అది తాను పెట్టిన పోస్టు కాదని శ్రీరెడ్డి పేర్కొన్నారు. అసలు ఉదయనిధిని తాను ఎప్పుడూ నేరుగా చూడలేదన్నారు. ఉదయనిధిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేసినట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ‘కరుణానిధి కుటుంబంపై నాకు గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఉదయనిధిని నేను నేరుగా చూసిన సందర్భం లేదు.
ఆయన గురించి వచ్చిన పోస్టు నా ఫేస్‌బుక్‌ ఖాతాది కాదు. అది ఓ నకిలీ ఖాతా. ఎవరో పనిగట్టుకుని అలా చేశారు. ఉదయనిధి పేరు ప్రతిష్ఠలను దెబ్బతీయాలని చేస్తున్న చర్యలివి. నా పేరిట సామాజిక మాధ్యమాల్లో పలు నకిలీ ఖాతాలు ఉన్నాయి. దీనికి సంబంధించి సైబర్‌ క్రైంలో ఫిర్యాదు చేశా. చాలా మంది కథానాయికలు చిత్ర పరిశ్రమలో లైంగిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. దానిపై బాహాటంగా ఆరోపణలు చేసినప్పటికీ నాకు మద్దతు దక్కలేదు అని అన్నారు…

ఆయనతో లిప్ లాక్ అంటే ఒకే అంటున్న తమన్నా🤯

No comments
లిప్ లాక్ కు రెడీ అంటున్నది తమన్నా
హీరోయిన్ తమన్నా పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దం దాటినప్పటికీ తన ఖాతాలో ఇప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా వేసుకోలేక పోయింది. అందాల ఆరబోతతో తనకంటూ కొన్ని పరిమితులు ఉన్నాయని అంటుంది. కొన్ని సినిమాలలో తన అందాలతో కుర్రకారుకు కాకపుట్టించిన ఈమె లిప్ లాక్ సీన్స్ మాత్రం ఏ సినిమాలోనూ చేయలేదు. కానీ, ఆ అవకాశం కేవలం ఆ ఒక్క హీరోకి మాత్రమే ఉన్నదని చెబుతుంది.
ఆ హీరోతో ఛాన్స్ వస్తే మాత్రం లిప్ లాక్ కు రెడీ అంటున్నది తమన్నా. ఇంతకీ ఆ హీరో ఎవరా అని అనుకుంటున్నారా? బాలీవుడ్ హీరో హ్రితిక్ రోషన్ అండి తమన్నాకు హ్రితిక్ రోషన్ అంటే చాలా ఇష్టమంట. గతంలో ఓసారి హ్రితిక్ ని కలసి ఫోటో దిగినప్పుడు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది. తెలుగు, హిందీ భాషలలో హీరోయిన్లు లిప్ లాక్ లు చాలా అలవోకగా చేస్తున్నఈ సమయంలో కూడా తమన్నా మాత్రం తనకు ముద్దు సీన్లు అస్సలు కంఫర్ట్ గా ఉండలేనని తేల్చి చెప్పేసింది…

పడకగదికి వస్తేనే ఇండస్ట్రీలో ఛాన్సులు: నాని హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

No comments
కాస్టింగ్ కౌచ్ అనేది పునాదులతో సహా ఇండస్ట్రీలో పాతుకుపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇదే ఇష్యూపై మాట్లాడింది. దర్శక నిర్మాతల పడకగదికి వస్తే కానీ ఇక్కడ అవకాశాలు అంత ఈజీగా రావని వాళ్ల కోరిక తీరిస్తే కానీ తమ టాలెంట్ వాళ్లకు కనిపించదని సంచలన వ్యాఖ్యలు చేసింది మాధవిలత. అప్పట్లో నచ్చావులే అంటూ వచ్చిన ఈ బ్యూటీ, నాని స్నేహితుడా సినిమాలో నటించింది.
తెలుగమ్మాయి కావడంతో మాధవికి ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో కొన్ని సినిమాలకే కనుమరుగైపోయింది మాధవిలత. మొన్న ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ కూడా చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది ఈమె. కమిట్‌మెంట్ అనేది చాలా పవిత్రమైన పదమని కానీ దాన్ని మనోళ్లు చెండాలం చేసారని చెబుతుంది. కమిట్మెంట్ అంటే ఇప్పుడు పడుకోవడం అనే అర్థానికి దిగజార్చారని చెబుతుంది మాధవిలత.
నిజానికి కమిట్మెంట్ అంటే ఒప్పుకున్న సినిమా పూర్తి చేయడం అని అర్థం. కానీ ఇప్పుడు మన దర్శక నిర్మాతలు మాత్రం కమిట్మెంట్ అంటే పడుకోవడానికి వస్తావా అన్నట్లు మార్చేసారంటుంది ఈమె. తనకు కూడా ఈ ఇబ్బందులు వచ్చాయని అప్పట్లో తనను కూడా కమిట్మెంట్ అడిగారని చెప్పింది మాధవిలత. అయితే వాళ్ల ఆలోచన అర్థం చేసుకుని నో చెప్పినట్లు తెలిపింది ఈమె. మొత్తానికి పడకగదికి వెళ్లి వాళ్ల కామవాంఛ తీరిస్తే తప్ప తెలుగులోనే కాదు ఎక్కడా హీరోయిన్లకు అవకాశాలు వచ్చే పరిస్థితి లేదని చెబుతుంది మాధవిలత…

ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమైన హీరోయిన్ అర్ధనగ్న ఫొటోలు…

No comments
నటి సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతోంది
ఓ హీరోయిన్ అర్ధనగ్న ఫొటోలు ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షం అయ్యాయి. ఆమె పేరుతో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసిన కొందరు దుండగులు హీరోయిన్‌కు సంబంధించి అసభ్యకర చిత్రాలు పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి ఆ నటి అవాక్కైంది. తమిళ సినిమా జోకర్‌లో నటించిన రమ్య పాండియన్‌కు ఈ పరిస్థితి ఎదురైంది. తన పేరుతో ఫేక్ ఐడీ సృష్టించిన ఆకతాయిలు హద్దు మీరి నగ్న ఫోటోని షేర్ చేశారు.
బ్యాక్ ఫోజులో సెమీ న్యూడ్ ఫోటో వైరల్ గా మారింది. ఇది రమ్య పాండియన్ అకౌంట్ నుంచి షేర్ చేయడంతో అది కాస్తా జెట్ స్పీడ్ తో వాట్సాపుల్లోనూ వైరల్ అయ్యింది. అయితే అది కాస్తా రమ్యకు తెలిసేసరికి అప్పటికే వైరల్ అయిపోయింది. దీంతో లబోదిబోమన్న సదరు నటి సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతోంది. అలాగే తన ఒరిజినల్ ఐడీల్ని కూడా అభిమానులకు తెలియజేసింది. తన ట్విట్టర్, ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ వివరాలను తెలియజేసింది. ఎవరైనా తన పేరుతో ఇలాంటి అసభ్యకర పోస్టులు పెడితే తనదృష్టికి తీసుకురావాల్సిందిగా కోరింది.

అతడినే పెళ్ళి చేసుకుంటా… తప్పుడు ప్రచారాలు ఆపండి !

No comments
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రేమ, పెళ్లి గురించి గత నాలుగు అయిదు సంవత్సరాలుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ తో ఈమె ప్రేమలో ఉందని, ఇద్దరు పెళ్లి చేసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటన వచ్చింది. అయితే పెళ్లి విషయమై అనుష్క గతంలో పలు సార్లు క్లారిటీగా తాను తల్లిదండ్రులు చూపించిన అబ్బాయిని చేసుకుంటాను, ప్రేమ వివాహం చేసుకోను అంటూ చెప్పేసింది. అయినా కూడా వార్తలు మాత్రం ఆగలేదు.



ఇటీవల ఈమె ఒక క్రికెటర్ తో ప్రేమలో ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ఆ క్రికెటర్ తో ఈ అమ్మడికి ఇదే ఏడాది పెళ్లి అన్నారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని కూడా కన్నడ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దాంతో ఆ వార్తలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యాయి. మీడియాలో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై అనుష్క మరోసారి స్పందించింది. తన తల్లిదండ్రులు చూసిన వారినే పెళ్లి చేసుకుంటాను ప్రేమలో తాను లేనంటూ క్లారిటీ ఇచ్చింది.

భాగమతి చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అనుష్క నిశబ్దం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అనుష్క ఆ సినిమాలో మూగ చెవిటి అమ్మాయిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. సమ్మర్ లో నిశబ్దంతో అనుష్క ఎంటర్ టైన్ చేయబోతుంది. అనుష్క ప్రస్తుతం తెలుగులో మరో లేడీ ఓరియంటెడ్ చిత్రంకు గాను చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది….

ఐదుగురు హీరోయిన్ల తో కుమ్మేసాడు…

No comments

లాక్‌డౌన్‌: బాయ్‌ఫ్రెండ్ ఇంట్లోనే ఇరుక్కుపోయిన టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్…

No comments
టాలీవుడ్‌లో ఆమె స్టార్ హీరోయిన్, చిన్న సినిమాలతో ఇండస్ట్రీకి వచ్చినా కూడా చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోల రేంజ్‌కు ఎదిగిపోయింది. ముఖ్యంగా ఓ హీరోతో ఆమెకు ఎఫైర్ కూడా బాగానే నడుస్తుందనే వార్తలు కూడా చాలా రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కూడా అమ్మడు సత్తా చూపించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అమ్మాయి గారికి చెప్పుకోలేని కష్టం వచ్చి పడింది. కరోనా కారణంగా ప్రకటించిన లాక్‌డౌన్‌లో ఈ సదరు హీరోయిన్ తన బాయ్‌ఫ్రెండ్ ఇంట్లోనే ఇరుక్కుపోయిందని తెలుస్తుంది.


రెండ్రోజుల కోసమని వస్తే రెండు వారాలుగా అక్కడే చిక్కుకుపోయింది ఈ బ్యూటీ.తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో కూడా వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె, మార్చ్ మూడో వారంలో ఓ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఇక్కడే స్టార్ హోటల్లో ఉంది. అయితే లాక్ డౌన్ కారణంగా అన్నీ మూసేయడంతో ప్రస్తుతానికి తన లవర్ కానీ లవర్ ఇంట్లోనే ఉంటుందని, ఉండాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో కలిసి నటించారు. అందులో ఒకటి బ్లాక్ బస్టర్ అయితే మరొకటి డిజాస్టర్.
కేవలం ఆయన కారణంగానే అప్పట్లో ఈమె పెళ్లి కూడా ఆగిపోయిందనే వార్తలున్నాయి. జనతా కర్ఫ్యూకు ముందు సిటీకి వచ్చిన ఈ బ్యూటీ, ఉన్నట్లుండి అన్నీ బంద్ అయిపోవడంతో లాక్ అయింది. టైమ్ చూసుకుని సొంత రాష్ట్రానికి వెళ్లాలని హీరో ఇంటికి వచ్చేసింది. కానీ ఇప్పటికే రెండు వారాలు అయినా కూడా ఇక్కడే ఉండిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆమెను ఎలాగోలా ఇంటికి పంపించేయాలని మన హీరో గారు కూడా ఉన్న పలుకుబడి మొత్తం వాడాడు కానీ పని మాత్రం జరగలేదు.
దాంతో చేసేదేం లేక లాక్ డౌన్ అంతా బాయ్ ఫ్రెండ్ ఇంట్లోనే ఉండిపోయేలా కనిపిస్తుంది ఈ బ్యూటీ. అందుకే సోషల్ మీడియాలో రోజూ ఫోటోలు, వర్కవుట్ వీడియోలు పోస్ట్ చేసే ఈ హీరోయిన్ కొన్ని రోజులుగా అన్నీ బంద్ చేసింది. ఆ హీరో కూడా ఇదివరకటి మాదిరి సోషల్ మీడియాలో యాక్టివ్ లేడు. ఏదేమైనా కూడా కరోనా కారణంగా హీరోయిన్ బాగానే ఇరుక్కుపోయింది.

కామసూత్ర’ నటి ‘ఇందిరా’ కి కరోనా ‘పాజిటివ్’…

No comments


ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్‌లోనూ కరోనా ప్రవేశించడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు, పార్క్‌లు, సినిమా థియేటర్లు, దేవాలయాలు మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడం లేదు. ఇక సెలబ్రిటీలు కూడా సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ చెప్పి ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సెలబ్రిటీ కరోనా బారిన పడ్డారు.హాలీవుడ్‌లో ‘కామసూత్ర’, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సినిమాల్లో నాయికగా నటించిన, భారత సంతతికి చెందిన ఇందిరా వర్మకు కరోనా సోకింది.
ఇటీవల ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా కరోనా వైరస్‌ (కోవిడ్-19) పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఇందిరా వర్మ వైద్యుల పర్యవేక్షణలో ఉంది. కాగా, ఇండియాలో ఇప్పటికే బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. హాలీవుడ్‌లో కూడా ప్రముఖ నటుడు టామ్‌ హ్యాంక్స్‌, ఆయన భార్య రీటా విల్సన్‌, జేమ్స్‌ బాండ్‌ నటి ఓల్గా కురిలెంకోతో పాటు మరికొందరు తారలు కరోనా వైరస్‌ బారిన పడ్డారు.

కాగా, ఇందిరా వర్మ తండ్రి భారతీయుడు కాగా తల్లిది బ్రిటన్‌. హాలీవుడ్‌లో ముఖ్యంగా ఈమె నటించిన ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘కామసూత్ర: ఏ టేల్‌ ఆఫ్‌ లవ్‌’తో వెండితెరకు పరిచయమైన ఇందిరా ఆ సినిమాతో చాలా పాపులర్ అయింది. ‘బ్రైడ్‌ అండ్‌ ప్రిజ్యుడిస్‌’, ‘బేసిక్‌ ఇన్‌స్టింక్ట్‌ 2’ లాంటి చిత్రాలతో పాటు పలు టీవీ సిరీసుల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌కు కరోనా పాజిటివ్
Advertisement

సినిమాలో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ చూపిస్తున్న ఆర్య 2 బామ.........!

No comments

శ్రద్దాదాస్ మంచి మేనిమెరుపు, ఒంపుసొంపులు, ఆకట్టుకునే సౌష్టవం ఉన్నా ఎందుకో గుర్తుంచుకోదగ్గ పాత్రలు ఆమెకు దక్కలేదు. కానీ తెలుగు ప్రేక్షకులకు ఈమె బాగా పరిచయమే. హీరోయిన్ గా మంచి అవకాశాలు రాకపోయినా, అవకాశాలకు ఏం కొదవలేదు. సెకండ్ హీరోయిన్ గా, కీలక పాత్రల్లో ఆమె చాలా సార్లు నటించారు .
శ్రద్ధా దాస్, జగపతి బాబుతో నటించి తెలుగు తెరకు పరిచయమైనా ఈ నటి అందాల ఆరబోత ఓ రేంజ్ లో ఉంటుంది అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఆర్య 2లో ఎంత అందాల ఆరబోత చేసిందో చెప్పక్కర్లేదు, ఆ అందాన్ని మర్చిపోలేరు కూడా అంత అందాల ఆరబోత చేసిన ఎందుకో ఈ భామకు పెద్దగా క్రేజ్ లేదు. తెలుగు సినిమాల్లో కూడా పెద్దగా అవకాశాలు లేవు అనే చెప్పాలి. అయితే ఈ భామ ప్రభాస్ సినిమాలోను నటించింది, అదే డార్లింగ్ లో. సినిమా హిట్ అయ్యింది కానీ పాపకు క్రేజ్ మాత్రం సొంతం కాలేదు అంటే నమ్మండి. ఇకపోతే ఈ భామకు అందం కూడా తక్కువ కాదు. మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారికంటే కూడా అందంగా ఉంటుంది.
సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది. అందుకే ఈ భామ ఫోటోలు ఓ రేంజ్ లో షేర్ చేస్తుంది. దాదాపు అన్ని ఇండస్ట్రీలను చుట్టిన ఈ భామకు అవకాశాలు లేక వెబ్ సిరీస్ లో నటిస్తుంది. అంతటితో ఆగలేదు ఈ భామ. ఎక్కడ పడితే అక్కడ ఎలా అంటే అలా సినిమాలు తీస్తూ ఆహా, ఓహో అనిపిస్తుంది అంటే నమ్మండి. ఇప్పుడు కూడా హాట్ పోజులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హీట్ పెంచేసింది అంటే నమ్మండి…

బట్టలు లేకుండా చెయ్యడానికి వెనుకాడను..కాని! సినిమా మోతం శృంగారమే కావాలంటే ఎలా ?

No comments
తెలుగులో ‘రక్త చరిత్ర’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రాధికా ఆప్తే, మొదటి చిత్రంతోనే హిట్ అందుకుంది కానీ ఆ చిత్రంలో ఆమెనే హీరోయిన్ అన్న సంగతి గుర్తించడానికి చాలా కాలమే పట్టింది. అయితే తరువాత వచ్చిన ‘లెజెండ్’ చిత్రంతో మాత్రం ఈమెకు మంచి మార్కులే పడ్డాయి. తరువాత మరోసారి బాలయ్యతో ‘లయన్’ వంటి చిత్రంలో కూడా నటించింది. అయితే ఈ చిత్రం తర్వాత ‘సౌత్ లో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు.


వారికి విలువ కూడా ఉండదు. సౌత్ లో ఓ హీరో నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు’ అంటూ కామెంట్స్ చేసి టాలీవుడ్ కు పూర్తిగా దూరం అయ్యింది. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ, ఇప్పుడు లాక్ డౌన్ వల్ల తాను ఇటీవల చేసిన హాట్ ఫోటో షూట్ లు అన్నీ ఒకేసారి వడ్డించింది. ఈ ఫోటోలు కుర్రకారుని ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇక పనిలో పనిగా.. అభిమానులతో ఓ సారి ముఛ్చటించింది కూడా.

ఎందుకు ఈ మధ్య ఎక్కువగా సినిమాలు చెయ్యడం లేదు ? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా: ‘ఎక్కువగా శృంగారానికి ప్రాధాన్యత ఉన్న సీన్ల గురించే దర్శక నిర్మాతలు నన్ను సంప్రదిస్తున్నారు. బట్టలు లేకుండా నటించడానికి నేను ఏమాత్రం ఆలోచించను. కథలో భాగంగా అలాంటి సీన్లు ఉంటే చేస్తా, కానీ కావాలని శృంగారపు సన్నివేశాలు ఇరికిస్తే నేను చెయ్యను” అంటూ చెప్పుకొచ్చింది రాధికా ఆప్తే…
Don't Miss
Viral-Adda-99 © all rights reserved
DPR