Responsive Ad Slot

Latest

latest

లాక్‌డౌన్‌: బాయ్‌ఫ్రెండ్ ఇంట్లోనే ఇరుక్కుపోయిన టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్…

Tuesday

/ Post Views :
టాలీవుడ్‌లో ఆమె స్టార్ హీరోయిన్, చిన్న సినిమాలతో ఇండస్ట్రీకి వచ్చినా కూడా చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోల రేంజ్‌కు ఎదిగిపోయింది. ముఖ్యంగా ఓ హీరోతో ఆమెకు ఎఫైర్ కూడా బాగానే నడుస్తుందనే వార్తలు కూడా చాలా రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కూడా అమ్మడు సత్తా చూపించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అమ్మాయి గారికి చెప్పుకోలేని కష్టం వచ్చి పడింది. కరోనా కారణంగా ప్రకటించిన లాక్‌డౌన్‌లో ఈ సదరు హీరోయిన్ తన బాయ్‌ఫ్రెండ్ ఇంట్లోనే ఇరుక్కుపోయిందని తెలుస్తుంది.


రెండ్రోజుల కోసమని వస్తే రెండు వారాలుగా అక్కడే చిక్కుకుపోయింది ఈ బ్యూటీ.తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో కూడా వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె, మార్చ్ మూడో వారంలో ఓ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఇక్కడే స్టార్ హోటల్లో ఉంది. అయితే లాక్ డౌన్ కారణంగా అన్నీ మూసేయడంతో ప్రస్తుతానికి తన లవర్ కానీ లవర్ ఇంట్లోనే ఉంటుందని, ఉండాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో కలిసి నటించారు. అందులో ఒకటి బ్లాక్ బస్టర్ అయితే మరొకటి డిజాస్టర్.
కేవలం ఆయన కారణంగానే అప్పట్లో ఈమె పెళ్లి కూడా ఆగిపోయిందనే వార్తలున్నాయి. జనతా కర్ఫ్యూకు ముందు సిటీకి వచ్చిన ఈ బ్యూటీ, ఉన్నట్లుండి అన్నీ బంద్ అయిపోవడంతో లాక్ అయింది. టైమ్ చూసుకుని సొంత రాష్ట్రానికి వెళ్లాలని హీరో ఇంటికి వచ్చేసింది. కానీ ఇప్పటికే రెండు వారాలు అయినా కూడా ఇక్కడే ఉండిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆమెను ఎలాగోలా ఇంటికి పంపించేయాలని మన హీరో గారు కూడా ఉన్న పలుకుబడి మొత్తం వాడాడు కానీ పని మాత్రం జరగలేదు.
దాంతో చేసేదేం లేక లాక్ డౌన్ అంతా బాయ్ ఫ్రెండ్ ఇంట్లోనే ఉండిపోయేలా కనిపిస్తుంది ఈ బ్యూటీ. అందుకే సోషల్ మీడియాలో రోజూ ఫోటోలు, వర్కవుట్ వీడియోలు పోస్ట్ చేసే ఈ హీరోయిన్ కొన్ని రోజులుగా అన్నీ బంద్ చేసింది. ఆ హీరో కూడా ఇదివరకటి మాదిరి సోషల్ మీడియాలో యాక్టివ్ లేడు. ఏదేమైనా కూడా కరోనా కారణంగా హీరోయిన్ బాగానే ఇరుక్కుపోయింది.

No comments

Post a Comment

Don't Miss
Viral-Adda-99 © all rights reserved
DPR